శ్రీశైల దేవస్థానం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు బుధవారం సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
తిరుమల తిరపతి దేవస్థానముల ఉప కార్యనిర్వహణాధికారి ఎం.లోకనాథం దంపతులు , సిబ్బంది పట్టువస్త్రాలను సమర్పించారు.
కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు, వేదపండితులు సంప్రదాయాన్ని అనుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి స్వాగతం పలికారు.
ఆ తరువాత పట్టు వస్త్రాలకు పూజాదికాలు నిర్వహించారు.
పూజాదికాల తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేశారు.
ఈ సందర్భంగా టిటిడి ఉప కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయములో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆనవాయితీగా పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు. బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాలను సమర్పించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిoదన్నారు.
