శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శనివారం
సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
తిరుమల తిరపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి జె. శ్యామలరావు దంపతులు
పట్టువస్త్రాలను సమర్పించారు.
వస్త్ర సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి
యం. శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు సంప్రదాయాన్ని అనుసరించి తిరుమల తిరుపతి
దేవస్థానం వారికి స్వాగతం పలికారు.ఆ తరువాత పట్టు వస్త్రాలకు పూజాదికాలు జరిపారు
పూజాదికాల తరువాత టి.టి.డి కార్యనిర్వహణాధికారి, వైదిక సిబ్బంది తదితరులు, మేళతాళాలతో
ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేశారు.
ఈ సందర్భంగా టిటిడి కార్యనిర్వహణాధికారివారు జె. శ్యామలరావు మాట్లాడుతూ మహాశివరాత్రి
బ్రహ్మోత్సవాల సమయములో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆనవాయితీగా పట్టువస్త్రాలను
సమర్పించడం జరుగుతోందన్నారు.పట్టువస్త్రాలను సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాన్నారు. బ్రహ్మోత్సవాలలో
పట్టువస్తాలను సమర్పించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటి కార్యనిర్వహణాధికారి
ఎం. లోకనాథం, వేదపండితులు వెంకటేష్, లక్ష్మణ్ కుమార్ పలువురు టి.టి.డి. సిబ్బంది పాల్గొన్నారు.