శ్రీశైల దేవస్థానం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ వారు శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు బి.రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె..సీనా నాయక్ ఈ పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమములో ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, పలువురు అర్చక స్వాములు, వేదపండితులు, అధికారులు, సిబ్బంది ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు కార్యనిర్వహణాధికారి అర్చకస్వాములు, వేదపండితులు, ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు దుర్గామల్లేశ్వర దేవస్థానం సిబ్బందికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు.
తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాల సమర్పణ సంకల్పం పఠించారు. అనంతరం నూతన వస్త్రాలకు పూజాదికాలు జరిపించారు.

ఆ తరువాత మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు ఫలపుష్పాలు, అమ్మవారికి పసుపు, కుంకుమలు గాజులు, సమర్పించారు.
ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరుపున ఆనవాయితీగా పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు.
శ్రీశైల దేవస్థానం వారిచే కాళహస్తీశ్వర స్వామివారికి, ఙ్ఞాన ప్రసూన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ జరిగింది. శ్రీశైల దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు, శ్రీ కాళహస్తి చేరుకొని ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
DATE: 10-02-2026
TIME: (12:00 AM TO 11:59 (PM) TEMPLE PILGRIMS COUNTING = 70,930
KIALASA DWARAM PILGRIMS COUNTING = 25,588
ANNADHNAM PEOPLE COUNTING = 18,072
TOTAL
COMPARTMENT STATUS =
FREE COMPARTMENT=
200 COMPARTMENTS = 0
500 COMPARTMENT (ALANKARAM) = 0
COMPARTMENT
CHANDRAVATHI KALYANA
MANDAPAM
COMPARTMENTS =01
PRASADAM
CHANDRAVATHI KALYANA MANDAPAM =
Free compartment, PRASADAM =
DARSHANAM =
ALANKARA DARSHANAM
SHIVA DEKSHA DEVOTES = =22,424
