శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, ద్వారకా తిరుమల వారు గురువారం సాయంకాలం స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. సత్యనారాయణమూర్తి ఈ పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజారావు, అర్చకులు శ్రీ భాను, వేదపండితులు, సోమశేఖరశర్మ, వెంకటేశ్వరశర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, దేవస్థాన అధికారులు, అర్చక స్వాములు, వేదపండితులు, ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులకు, అర్చకస్వాములకు స్వాగతం పలికారు.
తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. మేళతాళాలతో సంప్రదాయబద్దంగా స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు
సమర్పించారు.
ఈ సందర్భంగా ద్వారక తిరుమల దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ద్వారకాతిరుమల దేవస్థానం తరపున సంప్రదాయ బద్దంగా శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు. బ్రహోత్సవాలలో పట్టువస్త్రాలను సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.