
శ్రీశైల దేవస్థానం:కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరుపున మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు
గత నెల 27వ తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీన ముగియనున్నాయి.
ఈ మేరకు శ్రీశైలదేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు, పలువురు అధికారులు, తదితరులు ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ సమర్పణకు ముందుగా కాణిపాక దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.పెంచల కిషోర్, అర్చకులు, వేదపండితులు సాదరంగా ఈ దేవస్థాన అధికారులను ఆహ్వానించారు.
తరువాత సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించి, స్వామివారికి పూజాదికాలను జరిపించారు.
ఈ దేవస్థానం అధికారులను, అర్చకులను కాణిపాక కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు, వేదపండితులు వేదాశీర్వచనముతో సత్కరించారు.
ఆలయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సమయములో శ్రీశైల దేవస్థానం తరపున ఈ పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోంది.