
శ్రీశైల దేవస్థానం: టి. విజయగోపాల్, రేఖారాణి, హైదరాబాద్ వారు మంగళవారం శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.వీరు మొత్తం 53 చీరలు, 10 పంచెలను అందించారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు పి.మార్కండేయశాస్త్రి, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు కె. అయ్యన్న, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టరు కె. మల్లికార్జునులకు అందజేశారు. దాతకు తగు రశీదు , వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు,
ప్రసాదాలు అందించారు.
*స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషద్ పాఠశాల విద్యార్థులకు బహుమతుల ప్రదానం