పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీ కాళహస్తి దేవస్థానం
శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం వారు శనివారం సాయంత్రం స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూర్ శ్రీనివాసులు, కార్యనిర్వహణాధికారి కె.వి. సాగర్ బాబు ఈ పట్టువస్త్రాలను సమర్పించారు. కార్యక్రమం లో ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి పసల సుమతి, శ్రీమతి కొండూరు సునీత, అసిస్టెంట్ కమిషనర్ జి.మల్లికార్జునప్రసాద్, పర్యవేక్షకులు సి. నాగభూషణం, ఉపప్రధానార్చకులు ఆర్.వి. కృష్ణమూర్తి, వేదపండితులు సంగమేశ్వరశర్మ, అవినాష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, అర్చకులు, వేదపండితులు, శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు.
తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేసారు.
కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారితో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి ఎం. విజయలక్ష్మి ఓ. మధుసూదన్ రెడ్డి, శ్రీమతి సూరిశెట్టి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
Post Comment