
శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీకాళహస్తి దేవస్థానం వారు శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైల స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.వి.నాగేశ్వరరావు పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమం లో శ్రీకాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం ప్రధానార్చకులు సంబంధం గురుక్కుల్, సిబ్బంది పాల్గొన్నారు.
ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, అధికారులు, అర్చకులు, వేదపండితులు, శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు.
తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు , వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేసారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.మహాశివరాత్రి పర్వదినాలలో స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ సమర్పణ తమకెంతో ఆధ్యాత్మికానుభూతిని కలిగించిందన్నారు.