సంప్రదాయ రీతిన శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాలను సమర్పించిన ప్రభుత్వం

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా  బుధవారం   సాయంకాలం రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ  పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందారెడ్డి కూడా పాల్గొన్నారు.

 ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకస్వాములు, వేదపండితులు తదితరులు మంత్రికి ,  పార్లమెంట్ సభ్యులకు స్వాగతం పలికారు.తరువాత ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సమర్పణ సంకల్పం పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు మొదలైన కార్యక్రమాలు జరిగాయి.అనంతరం మంత్రి, పార్లమెంట్ సభ్యులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైల క్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేవారని ప్రతీతి. సంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి, దసరా  మహోత్సవాలలోనూ శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను అనవాయితీగా సమర్పిస్తోంది.

print

Post Comment

You May Have Missed