కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామికి శ్రీశైల దేవస్థానం తరుపున పట్టువస్త్రాల సమర్పణ

శ్రీశైల దేవస్థానం:కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరుపున  గురువారం  పట్టువస్త్రాలు సమర్పించారు.

సెప్టెంబరు 18వ తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 8వ తేదీతో ముగియనున్నాయి.

ఈ మేరకు శ్రీశైలదేవస్థానం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి విజయలక్ష్మీ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, అర్చకస్వాములు, వేదపండితులు తదితరులు ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.ఈ  కార్యక్రమం లో దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ  కార్యక్రమంలో కాణిపాక దేవస్థానం ధర్మకర్తలి మండలి అధ్యక్షులు ఎ. మోహన్రెడ్డి, పాల్గొన్నారు.

 ముందుగా కాణిపాక దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎ. వెంకటేష్, సహాయ కార్యనిర్వహణాధికారులు ఎస్. వి. కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు కోదండపాణి, వాసు, అర్చకులు, వేదపండితులు సాదరంగా ఈ దేవస్థాన అధికారులను ఆహ్వానించారు.

తరువాత సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించి, స్వామివారికి పూజాదికాలను జరిపించారు.

అనంతరం ఈ దేవస్థానం అధికారులను, అర్చకులను కాణిపాక కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు, వేదపండితులు వేదాశీర్వచనముతో సత్కరించారు.

ఆలయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిసంవత్సరం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో  ఈ పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితి .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.