
శ్రీశైల దేవస్థానం: శ్రీ అచ్యుత వేంకట సాయి మాధవ శశాంక్, నెల్లూరు , కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం మొత్తం 3 హారాలను దేవస్థానానికి సమర్పించారు.
పగడాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు కూడిన ఈ మూడు బంగారు హారాల మొత్తం బరువు 232 గ్రాములు.
వీటిలో 4 బంగారు గుండ్లు, ముత్యాలు, కెంపులు, పచ్చలు కలిగిన ఆకుపచ్చ రాయితో బంగారు డాలరును కలిగిన ఒక హారం బరువు 78 గ్రాములు. కాగా 4 బంగారు గుండ్లు, ముత్యాలు, కెంపులు, పచ్చలు ఆకుపచ్చ రాయి బంగారు డాలరుతో కూడిన మరోహారం బరువు 79 గ్రాములు. అదేవిధంగా పగడాలు డాలరుతో కూడిన మరో బంగారు హారం బరువు 75 గ్రాములు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ బంగారు హారాలను కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుకు అందజేశారు.
అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో పాటు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.