
శ్రీశైల దేవస్థానం:ప్రతీ నెలలో పౌర్ణమి రోజున శ్రీ భ్రమరాంబాదేవి వారికి భక్తులు పరోక్ష ఆర్జిత సేవగా లక్షకుంకుమార్చన జరిపించుకునే అవకాశం కల్పించామని శ్రీశైల దేవస్థానం ఈ ఓ కే ఎస్.రామరావు తెలిపారు.ప్రతీ నెలలో పౌర్ణమి రోజున ఈ లక్షకుంకుమార్చనను జరిపించుకోవచ్చు.ఇందులో భాగంగా అషాఢ పౌర్ణమి ఘడియలలో అనగా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5.30గంటల నుంచి ఈ లక్షకుంకుమార్చన పరోక్షసేవగా నిర్వహిస్తారు.
గత నెల పౌర్ణమి రోజు నుంచి లక్షకుంకుమార్చనను పరోక్ష ఆర్జిత సేవగా నిర్వహిస్తున్నారు. గత జూన్ 24వ తేదీ జ్యేష్ఠ పౌర్ణమిరోజున 657 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా సేవారుసుమును చెల్లించి ఈ పరోక్షసేవను జరిపించుకున్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ గత సంవత్సరం ఏప్రియల్ మాసం లో ప్రారంభించిన పరోక్షసేవను దేవదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రస్తుతం మరింతగా విస్తరింపజేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఇందులో భాగంగానే ప్రస్తుతం పౌర్ణమినాటి లక్షకుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవ విధానములో పాల్గొనే అవకాశం కల్పించామన్నారు . లక్షకుంకుమార్చన పరోక్షసేవకు భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు. మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యం వుందని తెలిపారు. ఈ కుంకుమ ద్రవ్యముతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పేర్కొన్నారు.
ఈ లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారంవృద్ధిలోకి వస్తుందని, సంతాన సౌఖ్యం కలుగుతుందని, పూర్వజన్మదోషాలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటారన్నారు.. ప్రతీనెలలో కూడా పౌర్ణమి రోజున భక్తులు ఈ పూజాదికాలను పరోక్షసేవ ద్వారా భక్తులు జరిపించుకోవచ్చునని అన్నారు.
ఆగస్టు నుంచి డిసెంబరు వరకు ఈ పూజలు నిర్వహించు తేదీలు :
| క్రమసంఖ్య నెల | లక్ష కుంకుమార్చన జరుపబడు తేది:
- ఆగస్టు 21వ తేదీ
- సెప్టెంబరు 20వ తేదీ
- అక్టోబరు 20వ తేదీ
- నవంబరు 18వ తేదీ
- డిసెంబరు 18వ తేదీ
కాగా శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈ ఆర్జితపరోక్షసేవలను ప్రారంభించింది.
భక్తులందరు కూడా ఈ పరోక్షసేవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.
ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351/ 52/53/ 54/55/56 లను సంప్రదించవచ్చునని ఈ ఓ పేర్కొన్నారు.
* పల్లకిసేవ సంప్రదాయ రీతిలో జరిగింది.
* BALABHADRA PATRUNI SREENADHA RAO & SMT. INDIRA DEVI, HYD presented GOLD CHAIN ( WEIGHING 46 GRAMS) AND PATTU VASTRAMS TO AMMAVARU.