×

శ్రీశైల దేవస్థానంలో 27న కామదహనం

శ్రీశైల దేవస్థానంలో 27న కామదహనం

* Uyala Seva, Nandheeswara Puuja, Ankalamma Vishesha Puuja performed in Srisaila Temple on 26th March 2021. Archaka swaamulu performed the puuja events.

*శ్రీశైల దేవస్థానం:పాల్గుణ శుద్ధ చతుర్దశి  (27.03.2021) న   కామదహనం కార్యక్రమం నిర్వహిస్తారు.

ఆలయం ముందుభాగంలో ని   గంగాధర మండపం వద్ద సాయంత్రం 6.00గం.లకు ఈ కార్యక్రమం  ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయంలో శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు.

అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని మనోహరగుండం ఎదురుగా వేంచేబు చేయించి విశేషపూజలను నిర్వహిస్తారు. అనంతరం ఉత్సనమూర్తులకు పల్లకీసేవ నిర్వహించి, గంగాధరమండపం వద్దకు తెచ్చి శాస్త్రోక్తంగా  పున: పూజలు చేస్తారు. తరువాత సాంప్రదాయాన్ని అనుసరించి గడ్డితో తయారైన  మన్మథ రూపాన్ని దహనం చేస్తారు .

మన్మధుడు శివతపోభంగం చేయగా, కోపించిన పరమేశ్వరుడు మన్మథుడిని ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజే దహించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కామదహనాన్ని నిర్వహించడం సాంప్రదాయమైంది.

కామదహన కార్యక్రమాన్ని వీక్షించడం వలన శివకటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ:

చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 30 న ఈ కుంభోత్సవం ఉంటుంది.

అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు,గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి.కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం,  శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారమైన ఈ రోజు (26.03.2021)న  అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు,కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు.

print

Post Comment

You May Have Missed