ఆలయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ధర్మపథం

శ్రీశైల దేవస్థానం: ఆలయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణలో భాగంగా రాష్ట దేవదాయశాఖ ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఈ ఓ  ఎస్.లవన్న పేర్కొన్నారు.  దేవాలయాలలో ప్రాచీన సంస్కృతి కళావైభవ సంరక్షణలో భాగంగా దేవదాయశాఖ ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఇందులో భాగంగా రెండు రోజులపాటు ప్రాణాయామంపై కార్యశాల (వర్క్ షాప్) నిర్వహిస్తున్నారు.ఈ రోజు (25.12.2021) ప్రారంభమైన ఈ అవగాహన సదస్సు రేపటితో (26.12.2021) ముగియనుంది.ఈ కార్యశాల ప్రారంభ కార్యక్రమం  ఈ రోజు ఉదయం ఆలయ దక్షిణ మాడవీధిలోని భ్రామరీ కళావేదికపై జరిగింది.ప్రారంభ కార్యక్రమం  ముగిసిన తరువాత కార్యాలయ భవనం లోని సమావేశ మందిరం లో అవగాహన కార్యక్రమం జరిగింది.

కార్యక్రమం లో ముందుగా ఆలయ సంప్రదాయాలను అనుసరించి కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, అర్చకస్వాములు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 కార్యనిర్వహణాధికారి  ప్రసంగిస్తూ ఆలయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణలో భాగంగా రాష్టదేవదాయశాఖ ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబరు 27వ తేదీన ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్చువల్ విధానం లో ప్రారంభించినట్లు ఈ ఓ గుర్తు చేసారు.రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాస్, దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి డా. వాణీమోహన్, దేవదాయశాఖ కమి షనర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు.

గత నెల 8వ తేదీన దేవస్థానం లో ధర్మపథం కార్యక్రమం లో భాగంగా సూర్యనమస్కారాలు, యోగాసనాలు, ఉచిత ఆయుర్వేద పరీక్షలు, నాడీపరీక్ష, భక్తిరంజని, సంప్రదాయ నృత్య కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి కూడా వేదికపై నుంచి స్వయంగా ప్రాణాయామం, యోగాసనాలు చేసి, వాటి విశిష్టతను వివరించారు.ఈ సందర్భంగా ఈ ఓ  మాట్లాడుతూ మన సనాతన ధర్మ ఔన్నత్యానికి, ఆదర్శానికి ఆలయాలే కేంద్రాలు అన్నారు.  మన ఆలయాలు సాంస్కృతిక నిలయాలుగా కూడా నిలిచాయన్నారు. భగవంతుని సన్నిధానంగానే కాకుండా సామాజిక కేంద్రాలుగా కూడా మన ఆలయాలు విలసిల్లాయన్నారు. ధర్మశాలలు, అన్నసత్రాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు ఆలయ వ్యవస్థలో అంతర్భాగంగా ఉండేవన్నారు. సంప్రదాయ కళలన్నీ ఆలయ కేంద్రాలుగానే రూపుదిద్దాయన్నారు.ప్రాణాయామం ఆవశ్యకతను వివరించారు. ప్రాణాయామం అంటే ప్రాణాన్ని లేదా ప్రాణశక్తిని నియమించడం, ప్రాణశక్తి పై విజయాన్ని సాధించడం అనే అర్థాలు చెప్పబడ్డాయన్నారు. శ్వాసక్రియకు జీవశక్తికే ప్రాణమని అంటారన్నారు. ఈ ప్రాణాయామం ద్వారా మనస్సు చంచలం లేకుండా స్థిరత్వాన్ని పొంది ఏకాగ్రత లభిస్తుందన్నారు.

తరువాత కార్యాలయ భవనం లోని సమావేశమందిరం లో ప్రముఖ ఆయుర్వేద, యోగా నిపుణులు డా. మాణిక్యేశ్వరరావు ప్రాణాయామ విశిష్టతను గురించి వివరించారు.ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా  ఆయా అంశాలను వివరించారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ యోగశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలలో ప్రాణాయామానికి చాలా నియమనిబంధనలు చెప్పారన్నారు. ప్రాణాయామ పద్ధతులు అష్టకుంభకములుగా యోగ గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. అయితే ప్రాణాయామ ప్రక్రియను తప్పనిసరిగా అనుభవజ్ఞులైన గురువు నుండి నేర్చుకోవడం మంచిదన్నారు.ఇంకా వారు మాట్లాడుతూ శరీరం అయిదు భాగాలుగా (కోశాలుగా) విభజించబడి వుంటుందన్నారు. అవి 1. అన్నమయ కోశం, 2. మనోమయకోశం, 3. ప్రాణయామకోశం, 4. విజ్ఞానమయ కోశం, 5. ఆనందమయకోశం అని చెప్పబడ్డాయన్నారు. ఇవన్ని కూడా ఒకదానికి ఒకటి అనుసంధానించి ఉంటాయన్నారు. వీటిలో ప్రాణమయకోశంతో ప్రాణాయామం సంబంధాన్ని కలిగి ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమములో ప్రముఖ నాడీవైద్యనిపుణులు శ్రీమతి కొండా పూర్ణరాజేశ్వరి, విజయవాడ, యోగా గురువు డా. పి.వి.ఎస్. లక్ష్మీ పీలేరు, చిత్తూరు జిల్లా, డా.రాయల సుధాకర్, సీనియర్ అడ్వకేట్, పీలేరు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం లో శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, ప్రచురణల విభాగ పర్యవేక్షకులు శ్రీమతి కె. గిరిజామణి తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed