శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజు బుధవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు
విశేషపూజలు జరిగాయి. యాగశాలలో శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి.
అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం,
చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి.
ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్టానాలు, రుద్రపారాయణలు,
హోమాలు జరిపారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం
ఘనంగా నిర్వహించారు.
రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు పలు రకాల పుష్పాలతో
పుష్పాలంకరణ చేశారు.
ప్రభోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ
చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత,
జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం,
తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన
చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేశారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వాహనసేవలో భాగంగా ఈ రోజు
శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహన సేవ ఆలయ ఉత్సవం నిర్వహించారు.