×

శ్రీశైల పరిధిలో మరిన్ని మొక్కలు నాటాలని దేవస్థానం నిర్ణయం

శ్రీశైల పరిధిలో మరిన్ని మొక్కలు నాటాలని దేవస్థానం నిర్ణయం

 శ్రీశైల దేవస్థానం: పర్యావరణ పరిరక్షణకు , క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు  శ్రీశైల పరిధిలో మరిన్ని మొక్కలు నాటాలని దేవస్థానం నిర్ణయించింది.ఈ వర్షాకాలం ముగిసేలోగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతంగా చేపట్టనున్నారు.ముఖ్యంగా వలయ రహదారికి ఇరువైపులా, ఆరుబయలు ప్రదేశాలలో, దేవస్థానం ఉద్యానవనాలలో మొక్కలను నాటి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటారు.ఆదివారం  వలయ రహదారిలో పలు మొక్కలు నాటారు. నిర్మాణంలో ఉన్న గణేశ సదనం సమీపంలో వలయ రహదారి వద్ద ఈ మొక్కలను నాటారు.

ఈ కార్యక్రమం లో బిల్వం, కదంబం, రావి, మహాగని, ఆకాశమల్లె మొదలైన మొక్కలను వలయ రహదారి వద్ద నాటారు.

 దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారిచక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి,  మేరాజోత్ హనుమంత్ నాయక్,  ఓ. మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుతన్నీరు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, ఉద్యాన వనాల విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ జి. ఈశ్వరరెడ్డి, ఉద్యానవన అధికారి లోకేష్, దేవస్థానం ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed