
శ్రీశైల దేవస్థానం:పర్యావరణ పరిరక్షణకు, క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు శ్రీశైల క్షేత్ర పరిధిలో దేవస్థానం పలుచోట్ల మరిన్ని మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టింది.
ఇప్పటికే వలయ రహదారికి ఇరువైపులా వివిధ రకాల మొక్కలను నాటారు. మర్రి, రావి, జువ్వి, వేప, కానుగ, నేరేడు, మొదలైన మొక్కలను రహదారి ఇరువైపులా నాటారు.ఇంకా ఆరుబయలు ప్రదేశాలు, దేవస్థానం ఉద్యానవనాలలో మొక్కలను నాటుతారు.
ప్రస్తుతం వలయరహదారి విభాగినిలో ( సెంట్రల్ మీడియన్ ప్లాంటేషన్ ) పలు రకాల మొక్కలు నాటుతున్నారు. ఈ విభాగినిలో సువర్ణగన్నేరు, భోగన్ విలియా, పొగడ మొదలైన మొక్కలు నాటుతున్నారు. వలయ రహదారి విభాగినిలో మొత్తం 4 వేల మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు.