శ్రీశైల దేవస్థానం:ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు (05.06.2021)న దేవస్థానం లో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పశ్చిమ మాడవీధి కుడివైపున ఒకే వరుసగా కదంబం మొక్కలను నాటారు.
శ్రీశైల క్షేత్రంలో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు ఆలయ పరిసరాలు మొదలైన చోట్ల బిల్వం, కదంబం, ఉసిరి, మేడి తదితర మొక్కలు నాటారు. పలు ఇతర ప్రదేశాలలో మర్రి, జువ్వి,కానుగ మొదలైన నీడనిచ్చే మొక్కలను కూడా నాటుతున్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి కే ఎస్. రామరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు దేవస్థానం లో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామన్నారు.ముఖ్యంగా వలయ రహదారికి (రింగురోడ్డు) ఇరువైపులా, దేవస్థానం ఉద్యానవనాలలోనూ , ఆరుబయలు ప్రదేశాలలోనూ ఈ మొక్కలను నాటాలని సంకల్పించామని చెప్పారు.
వర్షాకాలం ముగిసేలోగా క్షేత్రపరిధిలో భారీగా మొక్కలను నాటేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసారు. ఇందుకోసం పలురకాల మొక్కలను కూడా దేవస్థాన నర్సరీలో సిద్ధం చేసారు.
ఈ కార్యక్రమం లో ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి యం.హరిదాస్, హార్టికల్చరిస్ట్ లోకేష్, సహాయ స్థపతి జవహర్, అసిస్టెంట్ ఇంజినీర్ మేఘనాథ్, స్వామివారి అర్చకులు పి.నాగరాజు శాస్త్రి అమ్మవారి ఆలయ ఉపప్రధానార్చకులు యం.సుబ్రహ్మణ్యం, ఉద్యానవన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
*G. Obulu Naidu & Smt G. Vijayalakshmi, Vijayawada donated Rs. 1,01,116 for Annaprasaadha Vitharana.