లలితాంబికా దుకాణ సముదాయానికి  నూతనంగా మరో రహదారి ఏర్పాటుకు చర్యలు

 శ్రీశైల దేవస్థానం:లలితాంబికా దుకాణ సముదాయానికి  నూతనంగా మరో రహదారిని ఏర్పాటు చేయాలని దేవస్థానం సంకల్పించింది. గంగాధర మండపం – నందిగుడి కూడలి ప్రధాన రహదారిని కలుపుతూ దుకాణ సముదాయం వరకు ఈ రహదారి ఏర్పాటు చేస్తారు.రహదారి నిర్మాణానికి పొన్నూరు సత్రం కొంత భాగం మాత్రమే( సుమారు 12 గదులు) తొలగించాల్సి ఉంటుంది. ఈ కారణంగా సోమవారం  కార్యనిర్వహణాధికారి లవన్న  పొన్నూరు సత్రాన్ని పరిశీలించారు.  పొన్నూరు సత్రములోని పలువురు నివాసితులతో కార్యనిర్వహణాధికారి  ముఖాముఖిగా సంభాషించారు.

 పొన్నూరు సత్రములో తొలగించాల్సిన భాగం లో నివాసముంటున్న వారికి అందుబాటులో ఉన్న దేవస్థాన భవనాలలో వసతి ఏర్పాటు చేసేందుకు వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఈ ఓ   అధికారులను ఆదేశించారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, రెవెన్యూ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐ/సి) చంద్రశేఖరశాస్త్రి, రెవెన్యూ విభాగపు పర్యవేక్షకులు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed