
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఈ రోజు (10.11.2021)న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన కాటూరి రాము, శ్రీమతి లక్ష్మీకుమారి, విజయ ఫుడ్ ప్రాడక్ట్ వారు మామిడి తొక్కు (మామిడి మాగాయి) , నిమ్మకాయ పచ్చళ్ళను విరాళంగా అందజేశారు.
మొత్తం 1200కేజీల ఈ పచ్చళ్ళ విలువ సుమారు రూ.3,12,000/-లు దాకా ఉంటుందని దాత తెలియజేశారు.
రెల్లు వెంకటేశ్వరరావు, శ్రీమతి దుర్గా, శ్రీదుర్గా స్వీట్స్, బేకరీ & పికిల్స్ కర్నూలు వారు కూడా మామిడి తొక్కు (మామిడి మాగాయి) విరాళంగా అందజేశారు.
మొత్తం 1000కేజీల ఈ పచ్చళ్ళ విలువ సుమారు రూ.2,60,000/-లు దాకా ఉంటుందని దాత అన్నారు. దాతలు ఈ విరాళాలను కార్యనిర్వహణాధికారికి అందించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న మాట్లాడతూ అన్నప్రసాద వితరణలో భక్తులకు వీటిని వడ్డించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దాతలకు ధన్యవాదాలు తెలియజేసారు.
వీరికి దేవస్థానం తరుపున శేషవస్త్రాలు, ప్రసాదాలను కూడా బహూకరించారు.
ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు పి.నటరాజ రావు, డి.మల్లయ్య, ప్రజాసంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు కె.వెంకటేశ్వరరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.