శ్రీశైల దేవస్థానం: దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన విజయ పికెల్స్ వారు వివిధ రకాల ఊరగాయలను విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమం లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాటూరిరాము పాల్గొన్నారు. ఊరగాయలను శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి చేతుల మీదుగా వీరు దేవస్థానానికి అందించారు.ఈ ఊరగాయల విలువ రూ. 5,24,160/-లు ఉంటుందని దాత తెలియజేశారు. మామిడి, నిమ్మ, గోంగూర, పండుమిరపకాయ మొదలైన ఊరగాయలు అందజేసిన వాటిలో ఉన్నాయి.
అన్నప్రసాదవితరణలో భక్తులకు వీటిని వడ్డించాలని దాత కోరారు. శాసనసభ్యులు మాట్లాడుతూ దాతలు స్వచ్ఛందంగా పలు రకాల పచ్చళ్ళను విరాళంగా అందజేయడం ఎంతో హర్షణీయమంటూ దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం వీరికి దేవస్థానం తరుపున శేషవస్త్రం, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపిక, ప్రసాదాలు అందించారు.