నీ సొబగులెల్ల ఇంతి పుణ్యమే గదారా
ఏ సుద్దులు చెప్పకిక ప్రహ్లాదవరదా
సింగారి సిగ్గేమో నీ ముసి ముసి నవ్వులు
బంగారు యాకె మేని నీకు మణి దర్పణము
అంగన కుంతలములు నీ కంఠాభరణము
అంగపు చెమట నీకు పన్నీటి మజ్జనము
కోమలి కన్నుల నటనము నీకు కార్యశక్తి
సామాజయానము నీకు రతి పిలుపు
కొమ్మ కలయిక నీకు ఇంద్ర భవనము
కమ్మని మాటలు నీకు సుఖ వీణా నాదము
సుదతి పంటిగాట్లు నీకు నానా భూషణములు
అధర సుధలు నీకు దివ్యామృత పానము
ముదిత కౌగిలి నీకు పట్టు పీతాంబరములు
ఎదలోని తలుపులు నీకు బహు భోజనము
సిరి గాజుల చేతులు నీకు కటి సూత్రము
భారపు స్తనములు నీకు మధుర ఫలములు.
నారి కోరికలు నీకు తిరువారాధనములు
చేరి యాకే బెట్టు ముద్దులు నీకు తాంబూలము
*