శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం

 శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణంకోసం దేవస్థానం ఆదివారం రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించింది.

ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి , మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.

అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపారు.

ఆ తరువాత పల్లకీ ఉత్సవం జరిగింది.

*Traditional dance programme presented in kalaaraadhana today.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.