పవిత్రంగా పాగాలంకరణ

శ్రీశైల దేవస్థానం: ప్రత్యేక కార్యక్రమాలు :

లింగోద్భవకాల మహారుద్రాభిషేకం:శనివారం  రాత్రి గం.10.00ల నుండి శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రత్యేకం . నిష్ణాతులైన 11 మంది అర్చక స్వాములు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా, దాదాపు 4గంటలకు పైగా జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీస్వామివారికి అభిషేకంప్రత్యేకం.ఆలయప్రాంగణంలోని పవిత్రమైన మల్లికాగుండంలోని జలంతోను, పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ ఈ అభిషేకం ప్రత్యేకం.

పాగాలంకరణ: 

లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రారంభం ప్రత్యేకం. బ్రహ్మోత్సవాలలో  ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన వివాహాలలో పెండ్లి కుమారునికి తలపాగ చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరుతో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాగా స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించారు. పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగాను నేసారు. ఈ పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరించడం మరో విశేషం .పాగాలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేయడం మరో జాగర్త. చిమ్మచీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకొన్న పని. యథావిధిగా రాత్రి గం.10.00ల నుండి  చీరాల మండలం, హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు తాను స్వయంగా తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా స్వామివారికి అలంకరించడం విశేషం.

ఈ సంవత్సరం మొత్తం 23 పాగాలు శ్రీస్వామివారికి సమర్పణ.

ప్రకాశం జిల్లా నుంచి 1, బాపట్ల జిల్లా నుంచి 6, శ్రీకాకుళం జిల్లా నుంచి 8, హైదరబాదు నుండి 2, విజయ నగరం జిల్లా నుండి 2, కోనసీమ జిల్లా నుండి 2, పశ్చిమ గోదావరి నుండి 1 పాగ సమర్పించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.