
శ్రీశైల దేవస్థానం: దేవదాయశాఖ నియమనిబంధనల మేరకు శ్రీశైల క్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారాన్ని పూర్తిగా నిషేధించారు.
ఇందులో భాగంగా అన్యమత చిహ్నాలు, అన్యమత సాహిత్యం కలిగి వుండడం కూడా నిబంధనలకు విరుద్ధమే .
అదేవిధంగా ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని అన్యతమ ప్రచారానికి పాల్పడిన వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.
అన్యమత ప్రచారం నిరోధక చర్యలలో భాగంగా గత చాలాకాలంగా టోల్ గేట్ వద్ద వాహనాలను విస్తృత తనిఖీలు చేస్తున్నారు.
కాగా ఇటీవల సాధువేషంలో ఉన్న కొందరు హిందూమత చిహ్నాలు అయిన విభూతిధారణ, మాలాధారణ కలిగి ఉండడంతో పాటు అన్యమత చిహ్నం కలిగి సంచరించినట్లుగా దేవస్థానం దృష్టికి వచ్చింది.
ఈ విషయమై ఇప్పటికే సమగ్ర విచారణను చేపట్టాం. ఈ విషయమై స్థానిక పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతాం. దేవస్థాన భద్రతా సిబ్బందితో సంచార తనిఖీ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ బృందం క్షేత్రపరిధిలో విస్తృతంగా పర్యటించి అవసరమైన తనిఖీలను చేపడుతుందని ఈ ఓ ఉత్తర్వులో పేర్కొన్నారు.నియమనిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు తనిఖీలలోగాని లేదా విచారణలో గాని తేలితే చట్టప్రకారం చర్యలు ఉంటాయి.ఈ విషయమై స్థానిక పోలీసుల సహకారాన్ని కూడా తీసుకుంటాము,పోలీసుల సహకారముతో, అన్యమత ప్రచార నిరోధక చర్యలు ఉంటాయన్నారు.
క్షేత్రపరిధిలో అన్యమత ప్రచార నిరోధానికి అవసరమైన అన్ని చర్యలను పకడ్బందీగా చేపట్టాలని దేవస్థాన ముఖ్యభద్రతా అధికారికి ఆదేశాలు ఇచ్చారు.