భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ అధికార భాషా సంఘం, చేతన సచివాలయ సారస్వత వేదికతో కలిసి సచివాలయంలో ఆగస్టు 11వ తేదీన ‘స్వాతంత్ర్య స్పూర్తి – వజ్రోత్సవ దీప్తి’ శీర్షికతో కవిగాయక సమ్మేళనం నిర్వహిస్తున్నారు. శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి, నిజాం కళాశాల తెలుగు శాఖ ఆచార్య పగడాల నాగేందర్ , ప్రముఖ కవయిత్రి జూపాక సుభద్ర, సచివాలయ కవులు, గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు.