×

అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

 శ్రీశైల దేవస్థానం:చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజుముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 11 న ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు.

అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు,గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ  వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.

 ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం,  శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం పద్ధతి. ఇందులో భాగంగా మంగళవారం  రోజున  అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు,కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు.

*Bayalu veerabadra swamy pooja , Nandeeswara Pooja, Kumara swamy puja performed in the temple by Archaka స్వాములు

*Sampradaya Nrutyam in kalaradhana

print

Post Comment

You May Have Missed