×

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది-మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది-మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

👉  కేంద్ర ఆర్థిక మంత్రి తెలంగాణ ఊసే ఎత్తలేదు

👉 ఆంధ్రప్రదేశ్ కు నిధులిచ్చి తెలంగాణ కు అన్యాయం చేయడమేంటి

👉 తెలంగాణ బీజేపీ ఎంపీలు,ఇద్దరు కేంద్రమంత్రులు ఏం చేస్తున్నట్లు

👉 కాంగ్రెస్ ఎంపీలు కూడా నోరుమెదపటం లేదు

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు   అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2 గంటల ప్రసంగంలో తెలంగాణ పదాన్ని ప్రస్తావించలేదని పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై..
తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటున్న కేంద్రప్రభుత్వం..
తెలంగాణలోని ఒక్క  ప్రాజెక్ట్ కు అయినా  జాతీయ హోదా ప్రకటించాలని వినోద్ కుమార్ కోరారు.

విభజన చట్టం ప్రకారం తెలంగాణ హామీలు అమలు చేయడంతో పాటు,
ఐఐఎం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి  వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మోదీ ప్రభుత్వంపై చంద్రబాబు, నితీష్‌కుమార్‌ల  ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

print

Post Comment

You May Have Missed