నంద్యాల జిల్లా:
*శ్రీశైలంలో ప్రశాంతంగా, సౌలభ్యంగా స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు …..
*బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి ఇప్పటివరకు 1,95,555 మంది దర్శనం చేసుకోగా వారిలో శివ స్వాములు 50,504 మంది ఉన్నారు.
**పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రచారం చేయాలని విజ్ఞప్తి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం వారు భక్తుల అవసరాల దృశ్య సౌకర్యాలను ఏర్పాట్లు చేస్తున్నారు . అందుకు తగ్గట్టుగా పోలీసు శాఖ నుండి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు తొందరపడకుండా, సంయమనం పాటిస్తూ పోలీసువారి సూచనలను అనుసరిస్తూ దైవదర్శనం చేసుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేసారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ఇప్పటివరకు 1,95,555 మంది భక్తులు దర్శించుకోగా వారిలో 50,504 మంది శివ స్వాములు దర్శనం చేసుకోవడం జరిగింది.
వివరాలు
👉08 వ తేదీన ఆదివారం రోజున 45,360 మంది దర్శనం చేసుకోగా వారిలో శివ స్వాములు 7,000 మంది ఉన్నారు.
👉09 వ తేదీ సోమవారం రోజున 49,015 మంది దర్శనం చేసుకోగా వారిలో 15,600 మంది శివ స్వాములు ఉన్నారు
👉10 వ తేదీ మంగళవారం రోజున 70,930 మంది దర్శనం చేసుకోగా అందులో 22,424 మంది శివ స్వాములు ఉన్నారు.
👉11 వ తేదీ బుధవారం మధ్యాహ్నం 01 గంటల వరకు సుమారు 30,250 మంది దర్శనం చేసుకోగా వారిలో 5,480 మంది శివ స్వాములు ఉన్నారు.
శ్రీశైలంలో ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల అనూహ్య రద్దీ కారణంగా కొన్ని చిన్నపాటి ఘటనలు చోటు చేసుకున్నాయి. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలపై సామాజిక మాధ్యమాల వేదికగా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు..
