
శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం అమ్మవారి ఆలయం లో ఉన్న యాగశాల ప్రదేశంలోనే రాతి కట్టడం తో నూతన యాగశాల నిర్మిస్తున్నారు. దాత సహకారం తో ఈ యాగశాల నిర్మాణమవుతుంది.
బట్టా పర్వతయ్య, శ్రీమతి శారదాదేవి, హైదరాబాద్ వారు ఈ యాగశాలను నిర్మిస్తున్నారు.
కాగా ఈ రోజు (13.12.2021) ఉదయం యాగశాలలో ఉపపీఠం పై స్తంభాలు నెలకొల్పే పనులు ప్రారంభమయ్యాయి.
ఈ యాగశాలలోని ఈ స్తంభాలపై అష్టాదశ శక్తిపీఠాలు, నవదుర్గల మూర్తులు చెక్కినారు.
కాగా గత సంవత్సరం నవంబరు, 29న యాగశాల నిర్మాణ పనులకు భూమి పూజ జరిగింది. ఆ తరువాత ఆగస్టు 29న యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
ఈ కార్యక్రమములో ఇంచార్జి సహాయ కమిషనర్ సి. నటరాజరావు, దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి. మురళీ బాలకృష్ణ, ప్రజాసంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు, సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసు, పర్యవేక్షకులు శ్రీహరి, సహాయ స్థపతి ఐ.యు.వి. జవహర్ లాల్ , దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యాగశాల నిర్మాణంలో భాగంగా ఉపపీఠంపైన 16 స్థంభాలు నెలకొల్పుతున్నారు.
ఈ స్తంభాలపై అష్టాదశ శక్తిపీఠాలు, నవదుర్గ రూపాలు కళాత్మకంగా తీర్చిదిద్దారు.
నిర్మాణ దాతలుపర్వతయ్య మాట్లాడుతూ శ్రీస్వామిఅమ్మవార్ల కటాక్షముతోనే తమకు నూతన యాగశాల నిర్మింపజేసే అవకాశం లభించిందన్నారు.
- వెండి రథోత్సవ సేవ ఘనంగా జరిగింది.