
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. శ్రీశైల దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ధర్మకర్తల మండలిని నియామకం చేసింది. ఈ మేరకు రాష్ట్రపభుత్వం జీ.ఓ. ఆటినెం. 202, తేది: 24.03.2022 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.తదనుగుణంగా దేవదాయశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు అనుసరించి నూతన ధర్మకర్తలి మండలి చేత శుక్రవారం ఉదయం ఈ ఓ ఎస్. లవన్న పదవీ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు.
దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవనం లోని సమావేశ మందిరములో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమములో సభ్యులందరిని దేవస్థానం ఈ ఓ ముందుగా స్వాగతించారు.అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులుగా నియామకం అయిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి, మఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి జంగం సుజాతమ్మ, గురుమహంత్ మహేష్, జి.నరసింహారెడ్డి, శ్రీమతి జి.ఎమ్.విజయలక్ష్మీ శ్రీమతి బి. రామేశ్వరి, శ్రీమతి ఎ. లక్ష్మీ సావిత్రమ్మ, అలగుంతగిరి మురళి, మేరాజోత్ హనుమంతనాయక్, మధుసూదన్ రెడ్డి, శ్రీమతి బరుగురెడ్డి పద్మజ, శ్రీమతి సురిశెట్టి మాధవీలత, డా. శ్రీమతి కనకదుర్గవారి చేత కార్యనిర్వహణాధికారి ప్రమాణస్వీకారం చేయించారు.
తరువాత ధర్మకర్తల మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్వామివారి ప్రధానార్చకులు జె. వీరభద్రయ్యస్వామివారిచేత కూడా ప్రమాణస్వీకారం చేయించారు.
గవర్నమెంట్ మెమో ద్వారా ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియామకం అయిన తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.
ధర్మకర్తల మండలి అధ్యక్ష ఎన్నిక:
ప్రమాణస్వీకారం అనంతరం సభ్యులందరూ రెడ్డివారి చక్రపాణిరెడ్డిని ఏకగ్రీవంగా ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.కార్యక్రమం చివరిలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, పలువురు సభ్యులు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.
తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులకు, సభ్యులకు ఈ ఓ శ్రీస్వామి అమ్మవార్ల దర్శనాలను చేయించారు.
అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులందరికీ వేదాశీర్వచనముతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపిక అందించారు.