
*కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సి. హెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ ని ఈ రోజు సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి.
*బదిలీ అయిన ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ కి ఆత్మీయ వీడ్కోలు. గీతా మకరందం పుస్తకాన్ని అందజేసి, అభినందించిన కర్నూల్ రేంజ్ డిఐజి పి. వెంకటరామిరెడ్డి .జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి కి ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి కర్నూల్ రేంజ్ డిఐజి పి. వెంకటరామిరెడ్డి , జిల్లా జడ్జి డాక్టర్ వి.రాధాకృష్ణ కృపా సాగర్ , జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు .