-
- శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో కోవిడ్ నివారణ చర్యలు పెంచామని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.రాష్ట్ర దేవదాయ కమిషనర్ మార్గదర్శకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. వీటి అమలుపై చర్చించేందుకు ఆదివారం ఉదయం ప్రత్యేక సమావేశం జరిపి ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు, భక్తులను దర్శనాలకు అనుమతించడం, ఆర్జిత సేవల నిర్వహణ, కోవిడ్ కట్టడి మొదలైన వాటికి సంబంధించి ఈ నిర్ణయాలు ఉన్నాయన్నారు. కోవిడ్ నివారణ చర్యలపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కోవిడ్ కట్టడికిగాను దేవదాయశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా అవసరమైన మేరకు థర్మల్ స్క్రీనింగ్ గన్ మొదలైన వాటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనల భాగంగానే దేవస్థానం ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని సూచనలు చేస్తుండాలన్నారు. అన్ని విభాగాల సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలిగించకూడదన్నారు.
సమావేశం లో నిర్ణయాలు :
శ్రీ స్వామివారి గర్భాలయ (స్వామివార్ల స్పర్శదర్శనం) అంతరాలయ దర్శనాలు, అమ్మవారి అంతరాలయ దర్శనం తదుపరి నిర్ణయం వెలువడేంతవరకు పూర్తిగా నిలుపుదల. గర్భాలయ అభిషేకాలు నిలుపుదల . ఇప్పటికే ఆన్లైన్ ద్వారా గర్భాలయ టికెట్లు పొందిన వారికి, తిరిగి గర్భాలయ అభిషేకాలు పున: ప్రారంభం తరువాత వారు కోరుకున్న రోజున అభిషేకాలు జరిపించుకునే అవకాశం .
భక్తులందరికీ శ్రీస్వామి అమ్మవార్ల లఘు దర్శనానికి మాత్రమే అవకాశం. • ఆలయం లో శఠారి, తీర్థం ఉచిత ప్రసాద వితరణ తాత్కాలికంగా నిలుపుదల. వేదాశీర్వచనం కూడా నిలుపుదల . • గంటకు కేవలం 1000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు .
- శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో కోవిడ్ నివారణ చర్యలు పెంచామని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.రాష్ట్ర దేవదాయ కమిషనర్ మార్గదర్శకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. వీటి అమలుపై చర్చించేందుకు ఆదివారం ఉదయం ప్రత్యేక సమావేశం జరిపి ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు, భక్తులను దర్శనాలకు అనుమతించడం, ఆర్జిత సేవల నిర్వహణ, కోవిడ్ కట్టడి మొదలైన వాటికి సంబంధించి ఈ నిర్ణయాలు ఉన్నాయన్నారు. కోవిడ్ నివారణ చర్యలపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కోవిడ్ కట్టడికిగాను దేవదాయశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా అవసరమైన మేరకు థర్మల్ స్క్రీనింగ్ గన్ మొదలైన వాటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనల భాగంగానే దేవస్థానం ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని సూచనలు చేస్తుండాలన్నారు. అన్ని విభాగాల సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలిగించకూడదన్నారు.
- పరిమిత సంఖ్యలో ఆర్జితసేవలు . అన్ని ఆర్జిత సేవలలో కూడా ప్రస్తుతం నిర్దేశించినదానికంటే 50 శాతం మాత్రమే ఆర్జితసేవలు . • ఆర్జితసేవా టికెట్లను భక్తులు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే పొందవలసివుంటుంది. ఈ నెల 18 నుండి తాత్కాలికంగా (తదుపరి నిర్ణయం వెలువడేంతవరకు)కరెంట్ బుకింగ్ ద్వారా ఆర్జితసేవా టిక్కెట్ల జారీ పూర్తిగా నిలుపుదల. శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందవలసి వుంటుంది. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఆన్లైన్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం. దేవస్థానం వెబ్ సైట్:Srisailadevasthanam.org ద్వారా భక్తులు ఆర్జిత సేవాటికెట్లను, దర్శనం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చును. • ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సమయం లో భక్తులు వారి పూర్తి చిరునామ, ఫోన్ నెం. మొదలైన వివరాలను నమోదు చేయవలసి వుంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయం లో భక్తులు ముందస్తుగా కోవిడ్ వ్యాక్సినేషన్ ధృవీకరణ వివరాలను కూడా తప్పనిసరిగా పొందుపర్చవలసివుంటుంది. సామూహిక ఆర్జిత అభిషేకాలు రోజులో నాలుగు విడతలుగా (ఉదయం 6.30గం. 9.00 గం. మధ్యాహ్నం 12.30 గం. సాయంత్రం 6.30గం.లకు) వుంటాయి. ఒక్కొవిడతలో 75 టికెట్లు మాత్రమేఇస్తారు. వీరికి కూడా స్వామివారి దూర దర్శనం మాత్రమే కల్పిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం స్థానిక నెట్ సెంటర్లు, మీ – సేవా కేంద్రాల సహకారాన్ని పొందవచ్చును. భక్తులు ఆన్లైన్ ద్వారా పొందిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని, వారి ఆధార్ కార్డు నకలు | గుర్తింపుకార్డు నకలును తప్పనిసరిగా చూపాలి.
- • వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చంటిపిల్లల తల్లులు, 10 సంవత్సరాలోపు వయస్సుగల పిల్లలు తమ యాత్రను
ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలి. భక్తులు తమకు కేటాయించిన నిర్దిష్ట సమయములో (టైమ్ స్లాట్ లో) మాత్రమే దర్శనానికి, ఆర్జిత సేవలకు రావలసి వుంటుంది. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కును ధరించాల్సి వుంటుంది. మాస్కు ధరించని భక్తులను ఎట్టిపరిస్థితిలో కూడా దర్శనానికి అనుమతించరు. భక్తులు క్యూలైన్లలో ఆర్జిత సేవలను జరిపించుకునేటప్పుడు తప్పని సరిగా ఆరు అడుగుల భౌతికదూరాన్ని పాటించాలి. క్యూలైన్లలో ప్రవేశించేముందు విధిగా తమ శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించుకోవాలి. ఇందుకు దేవస్థానం తగు ఏర్పాటు చేసింది.
- *జలుబు, జ్వరము, దగ్గు వంటి లక్షణాలున్న వారిని ఆలయములోనికి అనుమతించే అవకాశం
వుండదు. • భక్తులు క్యూలైన్లలో ప్రవేశించేముందు శానిటైజర్ తో తమ చేతులను విధిగా శుభ్రరుచుకోవాలి.
ఇందుకు తగు ఏర్పాట్లు చేసారు. భక్తులు కూడా వ్యక్తిగత శానిటైజర్‌ను కలిగివుండడం
మంచిది. • భక్తులు క్యూలైన్ పైపులను, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు రైలింగులను ఎట్టి పరిస్థితిలో తాకరాదు.
ఆలయ ప్రాంగణములోని, పరివార ఆలయాలలోని దేవతా మూర్తులను, శిల్పాలను ఎట్టి పరిస్థితులలో భక్తులు తాకరాదు. కేవలం దూరం నుంచి మాత్రమే దర్శించుకోవాల్సి వుంటుంది. భక్తులు ఎక్కువ రోజులు శ్రీశైలంలో ఉండకుండా కేవలం దర్శనానంతరం వారి వారి స్వస్థలాలకు వెళ్ళడం మంచిది. వీలైనంత వరకు వారి యాత్రను ఒక్కరోజుకు మాత్రమే పరిమితం చేసుకోవలసినదిగా సూచన. పాతాళగంగలో పుణ్యస్నానాలను పూర్తిగా నిలుపుదల . కోవిడ్ నియంత్రణ చర్యలలో భాగంగా భక్తులను పాతాళగంగ వద్దకు అనుమతించడం కూడా తాత్కాలికంగా నిలుపుదల. రోప్, బోటింగ్ కూడా నిలుపుదల . భక్తులు తలనీలాలను సమర్పించే కేశఖండనశాలలో కూడా కోవిడ్ నిబంధనలను పకడ్బందీగాఅమలు. ఆలయప్రాంగణాన్ని, ఆలయ క్యూలైన్లను నిర్దిష్టమైన సమయపాలనతో శుభ్రపరచడం ( శానిటైజేషన్ చేయడం) అవసరం. కోవిడ్ జాగ్రత్తల గురించి క్షేత్రపరిధిలో, క్యూలైన్ల ప్రవేశద్వారం, ఆలయ పరిసరాలు మొదలైన చోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు.
సమావేశం లో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, సీనియర్ వేదపండితులు, అధ్యాపక (స్థానాచార్యులు) దేవస్థానం అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వి.రమణ, డిప్యూటీ తహశీల్దార్ ఎం. కిషోర్ కుమార్, మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డా. సోమశేఖరయ్య, స్థానిక టూరిజంశాఖ అధికారులు, దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు తదితరులు కూడా పాల్గొన్నారు.