సిబ్బంది అంతా జవాబుదారితనంతో, పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలి-నూతన ఈ ఓ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్

 శ్రీశైల దేవస్థానం: సిబ్బంది అంతా జవాబుదారితనంతో, పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని నూతన ఈ ఓ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్  అన్నారు. శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా నియమితులైన ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ సోమవారం     ఉదయం పరిపాలనా భవనములో అధికార బాధ్యతలను స్వీకరించారు.ఇంఛార్జి కార్యనిర్వహణాధికారి ఈ. చంద్రశేఖరరెడ్డి నుండి వీరు అధికార బాధ్యతలను స్వీకరించారు.అధికార బాధ్యతల స్వీకరణకు ముందు  ఆలయములో శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా పలువురు విభాగాధిపతులు, సిబ్బంది నూతన కార్యనిర్వహణాధికారికి శుభాభినందలు తెలియజేశారు

అనంతరం కార్యనిర్వహణాధికారి   మాట్లాడుతూ శ్రీస్వామిఅమ్మవార్ల అనుగ్రహంతో తనకు కార్యనిర్వహణాధికారివారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించిందన్నారు.శ్రీ స్వామిఅమ్మవార్లను సేవించుకునే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు. కార్యనిర్వహణాధికారిగా అటు స్వామిఅమ్మవార్లను, ఇటు భక్తులను సేవించుకునే అవకాశం తనకు లభించిందన్నారు. ముఖ్యమంత్రి,  దేవాదాయశాఖామంత్రి , స్థానిక  శాసనసభ్యుల  శ్రీశైలక్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే ప్రగాఢ సంకల్పంతో ఉన్నారన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో వారు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.వారి సూచనలతో , ఉన్నతాధికారులు, దేవస్థానం సిబ్బంది సహకారముతో శ్రీశైలక్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు చేపడుతామన్నారు .ముఖ్యంగా శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ ఆగమశాస్త్రాలను అనుసరించి సంప్రదాయబద్ధంగా నిర్వహింపజేసేందుకు అర్చకస్వాములు, వేదపండితుల సహకారంతో కృషి చేయడం జరుగుతుందన్నారు.

 భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా. వారికి సౌకర్యవంతమైన దర్శనాలను కల్పించేందుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటామన్నారు ఈ ఓ.

శ్రీశైలక్షేత్ర సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం జరుగుతుందని ఈ ఓ అన్నారు.

సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా గో సంరక్షణ, ధర్మప్రచారం మొదలైన కార్యక్రమాలను మరింతగా చేపట్టనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.ముఖ్యంగా చెంచుగూడెములకు దేవస్థానం ధర్మప్రచార రథాన్ని పంపి, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవాలను జరిపించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు , క్షేత్రసుందరీకరణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.సిబ్బంది అందరు కూడా జవాబుదారితనంతో పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలన్నారు ఈ ఓ.

print

Post Comment

You May Have Missed