శ్రీశైల ఆలయ ప్రాంగణంలో ఆర్జిత సేవా కౌంటర్ ప్రారంభం
శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం ఈ రోజు (26.10.2021) న ఆలయ ప్రాంగణంలో శ్రీగోకులం వద్ద నూతనంగా మరో ఆర్జితసేవా కౌంటర్ను ఏర్పాటు చేసారు.
ఈ ఉదయం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న పూజదికాలను జరిపి ఈ ఆర్జితసేవా కౌంటరును ప్రారంభించారు. ఈ నూతన ఆర్జితసేవ కౌంటర్ ప్రారంభాన్ని పురస్కరించుకొని మొదటి ఆర్జిత సేవా టికేటుగా శ్రీ వృద్ధమల్లికార్జున స్వామివారి అభిషేక సేవా టికేటును కార్యనిర్వహణాధికారి స్వయంగా కొనుగోలు చేశారు.
శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకాలు, శ్రీ వృద్ధమల్లికార్జున స్వామివారి అభిషేకం, కుంకుమార్చన, ఆర్జితహోమాలు, శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి కళ్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, శ్రీ గోకులంలో గో పూజ,గోసేవ (గోవుకు గ్రాసం సమర్పణ) మొదలైన ఆర్జితసేవా టికెట్లు ఈ కౌంటర్ ద్వారా ఇస్తారు.
ఆలయంలోకి ప్రవేశించిన తరువాత అప్పటికప్పుడు ఆయా సేవలను జరిపించుకోవలనుకున్న భక్తులకు అందుబాటులో ఉండేందుకు ఈ నూతన కౌంటరును ఏర్పాటు చేసారు.
ఇప్పటికే దర్శనం క్యూ కాంప్లెక్స్ ఎదురుగ రెండు ఆర్జిత సేవా కౌంటర్లు, మల్లికార్జున సదన్ లో ఒక కౌంటర్, గంగా సదన్ లో మరొక కౌంటర్ భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
Post Comment