శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్ర వైభవంపై నిర్వహించిన జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన ఈ జాతీయ సదస్సు గత నెల 30వ తేదీన ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమం లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనా రాయణ పాల్గొన్నారు.
ప్రారంభ కార్యక్రమం లో దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, మేరాజోత్ హనుమంతునాయక్‌లు పాల్గొన్నారు.
మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమాలలో పలువురు విశ్వవిద్యాలయాల, కళాశాలల అధ్యాపకులు, పండితులు, పరిశోధక విద్యార్థులు పలు అంశాలపై ప్రసంగించారు.
ఈ సదస్సులో శ్రీశైలక్షేత్రానికి సంబంధించి మొత్తం 18 మంది ఆయా అంశాలపై పరిశోధనా పత్రాలను సమర్పించారు .
ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమానికి ఆచార్య ఎం. సంపత్ కుమార్, సంచాలకులు, ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, నెల్లూరు అధ్యక్షత వహించారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమానికి తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు ఆచార్య యాదగిరి అధ్యక్షత వహించారు.
మూడు రోజులపాటు జరిగిన కార్యక్రమానికి దేవదాయశాఖ అర్చక ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ డా. వేదాంతం రాజగోపాల చక్రవర్తి సమన్వయ బాధ్యతలను నిర్వహించారు.
స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ డీన్ డా. ఎం. శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ‘ డా. ఇ.శోభన్ బాబు మూడురోజుల కార్యక్రమములో పాల్గొనడంతో పాటు పత్ర సమర్పణ చేశారు.
ఈనాటి కార్యక్రమం లో డా. సి. అనిల్ కుమార్ , శ్రీశైల ప్రభ సంపాదకులు, శ్రీశైల దేవస్థానం, జానపద సాహిత్యంలో శ్రీశైల ప్రస్తావన, డా. బి. అనిల్‌కుమార్, తెలుగు అధ్యాపకులు, నారాయణ ఐ.ఎ.ఎస్ అకాడమీ, హైదరాబాద్ విశ్వనాథ రచనలలో శ్రీశైల ప్రస్తావన, డా. భీంపల్లి శ్రీకాంత్, ఉపాధ్యాయుడు , మహబూబ్ నగర్ శ్రీశైల సాహిత్యం – సాంస్కృతిక శిల్పం, డా. ధూళిపాళ రామకృష్ణ, సంస్కృత శాఖాధిపతి, విజయవాడ కళాశాల – పురాణేతిహాసాలలో శ్రీశైల వైభవం, అయిలూరు ఉమావేంకట జవహర్ లాల్, సహాయ స్థపతి, శ్రీశైల దేవస్థానం – పంచమఠాల పునరుద్ధరణ గురించి, వి. గణేశ్, జిల్లెళ్ళమూడి -శ్రీశైలగిరి ప్రదక్షిణ – విశిష్టతపై పత్ర సమర్పణ చేశారు.
స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ పరిశోధకులు పి.ఏ. రాజు, శ్రీశైలక్షేత్ర దర్శనీయ స్థలాలు, శ్రీమతి నాగలక్ష్మి, పాలకుర్తి రాధిక, వరంగల్ – సంయుక్తంగా శ్రీశైలక్షేత్రం – చారిత్రక అంశాలపై పత్ర సమర్పణ చేశారు.
దేవస్థానం ఉపప్రధానార్చకులు, దేవస్థానం ఆగమపాఠశాల ప్రిన్సిపాల్, ఎం. శివశంకరయ్య, ముఖ్య అర్చకులు, పి.ఎం.నాగరాజు శాస్త్రి, ముఖ్య అర్చకులు ప్రసంగించారు.
సదస్సులో పత్ర సమర్పణ చేసిన వారికి , ఆయా అంశాలపై ప్రసంగించిన వారిని శ్రీస్వామివారి శేషవస్త్రం, ప్రసాదం, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికతో సత్కరించారు.
ఈ సదస్సుకు స్థానిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహితీ లహరి సాహిత్య సాంస్కృతిక సంస్థ, విజయవాడ వారు సహాయ సహకారాలు అందించారు.
మూడు రోజుల జరిగిన ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.హరిదాసు, పర్యవేక్షకులు బి. శ్రీనివాసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.