
శ్రీశైల దేవస్థానం: సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు :
• సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు ఆదివారం స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
• సాయంకాలం స్వామిఅమ్మవార్లకు నంది వాహనసేవ రమణీయంగా నిర్వహించారు.
• ఉత్సవాలలో భాగంగానే రుద్రహోమం, పారాయణలు, జపానుష్ఠానాలు జరిగాయి.
• ఈ ఉదయం మహిళలకు దక్షిణ మాడవీధిలో ( శివవీధిలో) ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చారు .
• ఈ సాయంత్రం స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం ప్రత్యేకం.
• బ్రహ్మోత్సవ కల్యాణానికి ప్రత్యేకంగా చెంచు భక్తులకు ఆహ్వానం.
• కల్యాణోత్సవానికి విచ్చేసే చెంచు భక్తులకు దేవస్థానం తరుపున వస్త్రాలు ( పురుషులకు పంచ, కండువా, మహిళలకు చీర, రవికవస్త్రం అందించారు.
• కనుమ పండుగ రోజున సంప్రదాయబద్దంగా గో పూజ జరిగింది.
*సాంస్కృతిక కార్క్రమాలు జరిగాయి.