శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అయిదవ రోజైన (15.01.2022) న శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి.
ఉత్సవాలలో భాగంగానే యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోకకల్యాణం కోసం చతుర్వేద పారాయణలు, జపాలు, రుద్రపారాయణ చేసారు.
తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారంగా జరిపారు.
ఈ సాయంకాలం ప్రదోష కాలపూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు జరిపారు.
నందివాహన సేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు నందిహనసేవ నిర్వహించారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో నందివాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు.
తరువాత ఆలయ ప్రాకారోత్సవం జరిగింది.
ఈ ప్రాకారోత్సవంలో హరిదాసు, శంఖం, జేగంట, డమరుకం మొదలైన వాటితో పాటు కోలాటం, చెక్కభజన, డోలు విన్యాసాలు మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేసారు.