
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) సోమవారం జె. వెంకట సురేష్, బృందం, నెల్లూరు వారు నాదామృతం కార్యక్రమం సమర్పించారు.
ఈ కచేరిలో వినాయక కృతి, సామజవరగమనా, ఎందరో మహానుభావులు, హిమగిరి తనయే తదితర కీర్తనలను వాయిద్యాలపై ఆలపించారు.
ఈ కార్యక్రమం లో నాదస్వర విద్వాన్ జె.వి సురేష్, నాదస్వర విద్వాన్ వి. కిషోర్, డోలు విద్వాన్ ఎం. జనార్థన్ పాల్గొన్నారు.
శృతి సహకారాన్ని వి. లీలధర్, తాళం సహకారాన్ని వి. నవీన్ తదితరులు అందించారు.
.