
శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శుక్రవారం పి.వి.ఎ. ప్రసాద్, విజయవాడ గాత్ర కచ్చేరి కార్యక్రమం జరిగింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం నుండి ఈ గాత్రసంగీతం కార్యక్రమం జరిగింది. శుక్లాంబరధరం, జయ జయ మహదేవ, నీలకంధరాదేవా, మహేశపాపవినాశా, శివశివశంకరా భక్తవశంకరా, ఓం. శివోహం, బ్రహ్మమురారి సురార్చిత లింగం తదితర గీతాలను, అష్టకాలను పి.వి.ఎ. ప్రసాద్ తదితరులు ఆలాపించారు.
15 న సాంస్కృతిక కార్యక్రమాలు:
15 న శ్రీమతి బ్రాహ్మణి బృందం, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పిస్తారు.