×

2న ముక్కోటి ఏకాదశి ఉత్సవం-శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం

2న ముక్కోటి ఏకాదశి ఉత్సవం-శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం

 శ్రీశైలదేవస్థానం:జనవరి 2, 2023న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది.ఈ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.ఈ కారణంగా భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనాన్ని త్వరితగతిన కల్పించాలని  మూడు రోజుల పాటు  31.12.2022 నుండి 02.01.2023 వరకు శ్రీమల్లికార్జునస్వామివారి స్పర్శదర్శనం, శ్రీస్వామివారి గర్భాలయ ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తారు.

ఈ మూడు రోజులలో సామూహిక అభిషేక సేవాకర్తలకు, వి.ఐ.పి విరామ దర్శనం ( బ్రేక్ టికెట్టు దర్శనం) వారికి కూడా శ్రీస్వామివారి అలంకార దర్శనం కల్పిస్తారు.

డిసెంబరు, 31, జనవరి 1వ తేదీన మహామంగళహారతి ప్రారంభం నుంచే భక్తులను అనుమతిస్తారు . జనవరి 2న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 6.00 గంటల నుండి దర్శనాలకు అనుమతిస్తారు.

 ముక్కోటి ఏకాదశిన  2వ తేదీన  వేకువజామున శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్తరద్వార దర్శనం, రావణవాహనసేవ,  గ్రామోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవంలో భాగంగానే ఉత్సవ మూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తరద్వారం నుండి వెలుపలకు తోడ్కొనివచ్చి ఆలయ ఉత్తరభాగంలోనే రావణ వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు

చేస్తారు.ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం గం.3.00లకు ఆలయద్వారాలను తెరచి మంగళ వాయిద్యాల అనంతరం గం.3.30ని||లకు స్వామివారికి సుప్రభాతసేవ ఉంటుంది. శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాలపూజలు జరిపించి గం.4.30 ని||లకు శ్రీస్వామిఅమ్మవార్లకు మహామంగళ హారతులు ఇస్తారు.ఈ ఉత్సవంలో భాగంగానే ఉదయం స్వామివారి విశేషపూజల తరువాత గం.5.00లకు శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తరద్వారం నుండి వెలుపలకు తోడ్కోనివచ్చి ఆలయ ఉత్తర భాగంలో రావణవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు చేస్తారు.శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం తదుపరి ఉదయం గం.6.00ల నుంచి భక్తులను దర్శనానికి, ఆర్జిత సేవలకు అనుమతిస్తారు.

print

Post Comment

You May Have Missed