×

శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవం ఘనం

శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవం ఘనం

శ్రీశైల దేవస్థానం:
23.12.2023:

• శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవం ఘనం.
• ముక్కోటి ఏకాదశి సందర్భంగా  ఈ రోజు వేకువ జాముననే శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజాదికాలు జరిగాయి.
• పూజాదికాల తరువాత జరిగిన రావణవాహనసేవ, గ్రామోత్సవం.
• ఉత్సవంలో పాల్గొన్న ధర్మకర్తల మండలి అధ్యక్షులు  రెడ్డివారి చక్రపాణిరెడ్డి , కార్యనిర్వహణాధికారి  పెద్దిరాజు, అధికారులు , సిబ్బంది, భక్తులు.

 ముక్కోటి ఏకాదశి ఉత్సవం:

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని  శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా వేకువజామున శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజాదికాలు, రావణవాహనసేవ నిర్వహించారు.

ఈ ఉదయం గం.3.00 లకు ఆలయ ద్వారాలను తెరచి మంగళవాయిద్యాల అనంతరం గం.3.30 ని!!లకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు జరిపించి గం.4.30!!లకు స్వామివారికి, తరువాత అమ్మవారికి మహామంగళ హారతులు జరిపించారు.

మహామంగళహారతుల తరువాత శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపములో ఉత్తర ముఖంగా వేంచేబు చేయించి విశేష పూజాదికాలను జరిపారు.

ఈ పూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు.

ఈ ఉత్సవ సంకల్పంలో, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని కోరారు.

అనంతరం ఉత్సవపూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు. మహాగణపతి పూజ తరువాత శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు పూజాదికాలను జరిపారు.

తరువాత ఈ ఉత్సవంలో భాగంగానే ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తర ద్వారం నుండి వెలుపలకు తోడ్కొనివచ్చి ఆలయ ఉత్తరభాగంలోనే రావణవాహనంపై ఆశీనులను చేయించి రావణవాహన సేవ జరిపారు.

తరువాత రావణవాహనంపై స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం జరిగింది.

 గ్రామోత్సవం తరువాత కూడా భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపం ఉత్తరం వైపున (బలిపీఠం సమీపంలో) వేంచేబు చేయించారు.

ఈ ఉత్సవంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు  రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి  పెద్దిరాజు దంపతులు, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు, హెచ్. వీరయ్యస్వామి, అమ్మవారి అర్చకులు, వేదపండితులు గంటి రాధాకృష్ణ శర్మ, అధ్యాపక పూర్ణానందర ఆరాధ్యులు, సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, పర్యవేక్షకులు బి. శ్రీనివాసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed