
*సహకరించిన పోలింగ్ సిబ్బందికి, మండల, డివిజనల్, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, ఇంచార్జి అధికారులకు, అభ్యర్థులకు, ఏజెంట్లకు, మీడియాకు అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు *
కర్నూలు, సెప్టెంబర్ 19 :-కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా, విజయవంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ముగిసిందని, సహకరించిన పోలింగ్ సిబ్బందికి, మండల, డివిజనల్, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, ఇంచార్జి అధికారులకు, అభ్యర్థులకు, ఏజెంట్లకు, మీడియాకు అందరికీ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ….జిల్లాలో నలభై నాలుగు మండలాల్లో 484 ఎంపీటీసీలు, 36 జడ్పిటిసి స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభం చేశామన్నారు.. కౌంటింగ్ కేంద్రాలలో సాఫీగా, పారదర్శకంగా, పకడ్బందీగా ఓట్ల లెక్కింపు జరిగిందన్నారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అందరి సహకారంతో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేశామన్నారు.
కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ :-
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఉదయం 6 గంటల నుండి జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. 14 మంది లైజన్ అధికారులు తమకు కేటాయించిన మండలాల నుండి ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను సేకరించి విడుదల చేసారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ లో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపు రెడ్డి మౌర్య, అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ,జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి శ్రీనివాసులు, జెడ్పి సిఈఓ వెంకట సుబ్బయ్య, డిపిఓ ప్రభాకర్ రావు, 14 మంది లైజన్ అధికారులు, జిల్లా అధికారులు ఎన్నికల విధులను నిర్వర్తించారు..
KURNOOL DIST 19.09.2021
Revised report
MPTC / ZPTC ELECTIONS 2021
REPORT AT 5.30 PM
MPTCs
Total No.of MPTCs – 807
No.of MPTCs unanimous – 312
No.of MPTCs where election heldup due to deaths – 8 + 3 mptcs merged into Adoni municipality
No.of MPTCs where election conducted – 484
No.of MPTCs where Results declared – 484
YSRCP – 406
TDP – 62
BJP – 03
CPI – 02
INDEPENDENT – 11
ZPTCs
Total No.of ZPTCs – 53
No.of ZPTCs unanimous – 16(01- death case in kolimigundla mandal)
No.of ZPTCs where poll not conducted -01(contesting candidate died in Nandyal)
No.of ZPTCs where elections conducted – 36
No.of ZPTCs where Results declared – 36
YSRCP – 36
*courtesy:DD,I&PR,KURNOOL