KCR mourned the death of Allam Padma

Chief Minister  K Chandrashekhar Rao has mourned the death of
Allam Padma, wife of Telangana State Media Academy Chairman  Allam
Narayana. The CM recalled the services rendered by Allam Padma during
separate state hood movement. The CM spoke to  Allam Narayana over the
phone and conveyed his condolences to members of the bereaved family.

*Sr.Journalist K.Hanumantha Rao extends tributes to Allam Padma.

ఆ “అమ్మ” ఇకలేరు
మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి,మహిళా జె ఏ సి లో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ గారు అస్వస్థతతో కన్నుమూశారు. గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తూనే అప్పట్లో ఉద్యమంలో, ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ అకాలమరణం చెందారు.
ప్రధానంగా ఉస్మానియా లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మెస్ లు కూడా మూసేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన సమైక్య పాలకులకు ఆ విద్యార్థుల ఆకలి తీర్చి ధీటైన సమాధానం చెప్పి ఎందరో విద్యార్థులకు ఆకలి తీర్చిన అమ్మ అయ్యి అమ్మ ల సంఘం అధ్యక్షురాలిగా నేటికీ కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్థాపించి ఉద్యమాన్ని ఉరకలెత్తించి,నమస్తే తెలంగాణ సంపాదకులుగా పనిచేసి,ప్రస్తుతం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కొనసాగుతున్న అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మక్క.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.