
హైదరాబాద్, నవంబర్ 12 :: రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శనివారం హైదరాబాద్ కు విచ్చేసిన ప్రధాన మంత్రికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందరరాజన్ ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మాత్యులు జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్లమెంట్ సభ్యులు కె.లక్ష్మణ్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.