కర్నూలు,శ్రీశైల దేవస్థానం:శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సోమవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.రాజగోపురం వద్ద అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు.అంతకుముందు భ్రమరాంబ అతిథి గృహానికి విచ్చేసిన మాలగుండ్ల శంకర్ నారాయణ కు దేవస్థాన ఈవో లవన్న స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు.