
శ్రీశైల దేవస్థానం: అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం శ్రీశైలం దేవస్థానం చేరుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షిగణపతి స్వామివారిని దర్శించుకున్నారు. సాక్షిగణపతి ఆలయంవద్ద మంత్రికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వాహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ. మురళి, శ్రీమతి జె. సుజాతమ్మ తదితరులు స్వాగతం పలికారు . ఈ సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వెండి రథోత్సవ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ లో పాల్గొన్నారు. శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకున్నారు.