
*కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులు, ఆంధ్రా ప్రభుత్వ వైఖరి, కేంద్రం ఉదాసీనతపై మంత్రుల నివాస సముదాయంలో మీడియా సమావేశం. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు, టీఎస్ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి .
– తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసుల మీద కేసులు వేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆంధ్రా అక్రమ ప్రాజెక్టుల మీద ఒక్క కేసు కూడా ఎందుకు వేయలేదు ?
– ప్రాజెక్టులు పూర్తయితే కేసీఆర్ గారికి కీర్తి దక్కుతుందన్న అక్కసు, దురుద్దేశం తప్ప కాంగ్రెస్, బీజేపీ నేతలకు మరో ఆలోచన లేదు
– శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే నిర్మించిన ప్రాజెక్టు.
– మద్రాసు నగరానికి తాగునీటి పేరుతో రాయలసీమకు, నెల్లూరుకు సాగు నీరు ఎత్తుకు పోతున్నారు.
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నది నుండి నాడు కేటాయించిన 811 టీఎంసీల నీళ్లలో అత్యధిక నదీ పరివాహక ప్రాంతం ఉన్న (20 వేల స్వ్కయర్ మైళ్లు) తెలంగాణకు 299 టీఎంసీలు, కేవలం 9 వేల స్వ్కయర్ మైళ్లు పరివాహక ప్రాంతం ఉన్న ఆంధ్రాకు 512 టీఎంసీలు కేటాయించడం పూర్తిగా అన్యాయం.
– తెలంగాణకే 500 టీఎంసీలు కేటాయించాల్సింది.
– ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్రమంగా ఆంధ్రా ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులను ముందుపెట్టి , వాటిని చూయించి ఆంధ్రాకు నీళ్లు కేటాయించడం నాటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పున కు పూర్తిగా విరుద్దం.
– కృష్ణా బేసిన్ అవసరాలు తీరకుండానే అక్రమంగా ఆంధ్రా ప్రభుత్వం పెన్నా బేసిన్ కు నీటిని తరలించడం ముమ్మాటికీ అన్యాయం, అక్రమం.
– కాళేశ్వరం నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అటు మహారాష్ట్ర , ఇటు చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, ఒప్పందాలు చేసుకుని నిర్మించారు.
– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవరితో చెప్పకుండా , ఎవరితో మాట్లాడకుండా అక్రమంగా ఏకపక్షంగా నిర్మిస్తున్నారు .. రాయలసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన చట్టంలో లేదు
– శ్రీశైలం డ్యాంను ఏకంగా ఖాళీ చేసేందుకు కుట్ర చేస్తున్నారు .. 300 మీటర్ల వెడల్పుతో శ్రీశైలం రిజర్వాయర్ లో కాలువలు తవ్వి నదినే మలిపే ప్రయత్నం చేస్తున్నారు.
– దీనిమూలంగా ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయి
– బచావత్ ట్రిబ్యునల్ క్రిష్ణానదిలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని సంపూర్ణంగా వాడుకునేందుకే జోగుళాంబ బరాజ్, భీమా ఇరిగేషన్ కాలువ ప్రతిపాదించాము.
– 854 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు కాలువ తవ్వి అక్రమంగా నీటిని తోడుకుంటున్నప్పుడు , 800 అడుగుల వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా నిర్మిస్తున్నప్పుడు, 808 అడుగుల వద్ద ప్రజలకు అవసరమైన కరంటు ఉత్పత్తి చేస్తే తప్పేంటి ? పైగా కరంటు ఉత్పత్తి కోసమే కదా 808 అడుగుల వద్ద వెంట్స్ పెట్టింది ?
– గతంలో తెలంగాణ మంచినీటి అవసరాలను కూడా లెక్క చేయకుండా క్రిష్ణా డెల్టాకు నీళ్లిచ్చే ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి జలవిద్యుత్ ఉత్పత్తి చేసింది మరిచారా ? ఏడేండ్ల కరువులో కూడా క్రిష్ణా డెల్టాకు నీళ్లు వదిలింది వాస్తవం కాదా
– ఆంధ్ర పండాలి – తెలంగాణ ఎండాలి…నాడు ఆంధ్రా పాలకుల వైఖరికి, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి ఏం తేడా లేదు. తమకు నీళ్లులేవనే పెడబొబ్బలు కాదు, ఏ ఆధారంగా ఎన్ని నీళ్లు తమకు హక్కుగా వస్తాయో ఆంధ్రా నాయకులు ఎప్పుడూ చెప్పరు.
– కేఆర్ఎంబీ బోర్డును హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయాలి
– కేంద్రం క్రియాశీలకపాత్ర పోషించకపోవడం, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలను పట్టించుకోకపోవడం అన్యాయం .. ఇప్పటికైనా నిర్దిష్ట కాలగడువు పెట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా కేటాయింపులు సత్వరమే జరిగేలా చూడాలి
– జాతీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించవా ?
– నదీజలాలు, ఉద్యోగాలలో తెలంగాణకు అన్యాయం కాంగ్రెస్ పాపమే
– తెలంగాణకు చేసిన పాపం కడుక్కునే అవకాశం వచ్చినా విస్మరిస్తున్నారు.
– కేసీఆర్ మీద గాలిమాటలు మాట్లాడడం తప్ప వారికి తెలంగాణ ప్రయోజనాల గురించి చిత్తశుద్ది లేదు
– ప్రధానికి లేఖలు రాయడం వల్ల సమస్య పరిష్కారమవుతుందనుకుంటే అనాలోచితం .. ఆంధ్రా ప్రభుత్వం తన చర్యలను సరిదిద్దుకోవాలి
– తెలంగాణది ధర్మపోరాటం .. మా హక్కులకోసం మేం పోరాడుతున్నాం.
– పులిచింతల వద్ద విద్యుత్ ఉత్పత్తి గురించి మాట్లాడేవారికి మరి 60 ఏండ్లు తెలంగాణ గోస ఎందుకు పట్టలేదు ? తెలంగాణకు ఓ ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేదు ?
– తెలంగాణ ప్రజలంత విశాల హృదయం ఈ దేశంలో ఎవరికైనా ఉందా ?
– అరవైఏండ్లు కండ్ల ముందు నుండి నీళ్లు వృధాగా పోతుంటే , ఈ ప్రాంత నాయకులే మోసం చేస్తున్నా మౌనంగా భరించారు.