భక్తులకు విశేష అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు-మంత్రి  ఆనం

*శ్రీశైలం అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన మార్గదర్శకాలు*

*

శ్రీశైలం, ఫిబ్రవరి 24: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అందిస్తున్న సేవలు, ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణ రెడ్డి దగ్గరుండి సమీక్షించారు. శివ భక్తుల క్యూలైన్‌లోకి వెళ్లి స్వయంగా పరిశీలించిన మంత్రి, భక్తులకు కల్పించిన సదుపాయాలను అడిగి తెలుసుకుని, వారి యోగక్షేమాలను మరింత మెరుగుపరిచేందుకు అధికారులకు సూచనలు అందించారు.

➖ ఇప్పటివరకు ఎదురైన చిన్న చిన్న పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. అదనంగా, భక్తులు ఇరుముడిని విరమించే ప్రదేశాన్ని విస్తరించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

➖ శివ భక్తుల కోసం చేపట్టిన మహాశివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లను అడుగు అడుగునా పరిశీలించిన మంత్రి, భక్తుల అభిప్రాయాలను స్వీకరించి, మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భక్తులకు విశేష అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు.

➖ ఏర్పాట్లు పరిశీలించిన వారిలో మంత్రి ఆనం తో పాటు శ్రీశైలం శాసన సభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు

*ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తా – మంత్రి ఆనం

➖ శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న భూమి వివరాలు పరిష్కారం కోసం స్వయంగా మంత్రి నేడు స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.

➖ , శ్రీశైలం భవిష్యత్తు అభివృద్ధి దృష్ట్యా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్చలు జరుపుతోందని మంత్రి వివరించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూ సమస్యల పరిష్కారం అనంతరం, శ్రీశైలం అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు చెప్పారు.

➖ ఈ అంశాలపై సమీక్ష సమావేశంలో శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థాన ఈవో శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరిచేలా కీలక నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.