
శ్రీశైల దేవస్థానం: ఆన్లైన్ ద్వారా టికెట్ల జారీపై శనివారం కార్యనిర్వహణాధికారి లవన్న సమావేశాన్ని నిర్వహించారు. భ్రమరాంబా సదన్ అతిధి గృహం లోని సమావేశ మందిరం లో జరిగిన ఈ సమావేశం లో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
మే 1వ తేదీ నుంచి అన్ని ఆర్జితసేవలు , శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లను భక్తులకు ఆన్లైన్ ద్వారానే జారీ చేయాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ రోజు జరిగిన సమావేశం లో ఈ టికెట్టు జారీ విషయం పై సుదీర్ఘంగా చర్చించారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఏప్రియల్ 25 తేది నాటికి టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్ సైట్ www.srisailadevasthanam.org లో అందు బాటులో ఉంచాలని ఐటి విభాగాన్ని ఆదేశించారు.అదే విధంగా భక్తులు ఆన్ లైన్ ద్వారా టికెట్టు పొందడంలో తగు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారాన్ని కల్పించాలని అన్నారు.శ్రీశైలంలోని ప్రధాన కూడళ్ళలో, అన్ని సత్రాల వద్ద ఈ విషయమై బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు.సామాజిక మాధ్యమాలలో, శ్రీశైలటీవిలో కూడా ఈ విషయమై ప్రచారాన్ని కల్పించాలన్నారు.
సామాన్య భక్తుల సర్వదర్శనానికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను అన్నీ అర్జితసేవలు కూడా విడతలవారిగా నిర్వహించే విషయాన్ని కూడా భక్తులకు తెలిసే విధంగా తగు ప్రచారాన్ని కల్పించాలన్నారు ఈ ఓ.అదేవిధంగా శ్రీ స్వామివారి స్పర్శదర్శనం కూడా నిర్ధిష్ట వేళల్లోనే కల్పించే విషయాన్ని కూడా భక్తులకు తెలియజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.ముఖ్యంగా ఆర్జితసేవా కర్తలు, స్పర్శదర్శనం టికెట్ పొందినవారు విధిగా వారు ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్ ప్రింట్ కాపీని (హార్డ్ కాపీని) ఆధార్ గుర్తింపు కార్డును తెచ్చుకోవలసి ఉంటుందని అన్నారు. ఆన్లైన్ ద్వారా పొందిన ఆయా టికెట్లను స్కానింగ్ జరిపిన తదుపరి ఆధార్ గుర్తింపు అనుసరించే భక్తులకు ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో సహాయ అసిస్టెంట్ కమిషనర్ హెజి.వెంకటేష్, సహాయ కార్యనిర్వహణాధికారులు ఎం. ఫణిధర ప్రసాద్, ఐ.ఎన్.వి. మోహన్, ఎం. హరిదాసు, శ్రీశైల ప్రభ సంపాదకులు డా. సి. అనిల్ కుమార్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు సి. మధుసూదన్‌రెడ్డి, పి. ఉమేష్, ఎం. రవికుమార్, ఆలయ, వసతి, ఐ.టి విభాగపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.